19 April, 2026 | 12:21 PM

కుష్టు వ్యాధి లక్షణాలపై సర్వే

02-12-2024 07:53 PM

జైనూర్ (విజయక్రాంతి): జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధి లక్షణాలపై సర్వే చేపట్టడం జరుగుతుందని వైద్యాధికారులు అశోక్, రాజు తెలిపారు. సోమవారం సేకుగుడాలో సర్వే నిర్వహించారు. సందర్భంగా పై అధికారులు మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామాలలో పర్యటిస్తూ కుష్టు వ్యాధి లక్షణాలపై సర్వే చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. లక్షణాలున్న వారికి మధ్య పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.హెచ్ మనోరమ, హెల్త్ అసిస్టెంట్ భరత్, ఏఎన్ఎం సెవంతా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.