12-11-2025 09:04:55 AM
మోతె: మండల పరిధిలోని మామిల్లగూడెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఎస్కే సైదులు గుండెపోటుతో మృతిచెందిన విషాద ఘటనపై తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ & లెక్చరర్స్ ఫెడరేషన్, టి పి టి ఎల్ ఎఫ్ సంతాపం తెలిపింది. టి.పీ.టి.ఎల్.ఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జే. నరసింహారావు మాట్లాడుతూ ప్రైవేట్ ఉపాధ్యాయులు విద్యారంగానికి వెన్నుముక లాంటివారని. మరణించిన ప్రతి ప్రైవేట్ ఉపాధ్యాయుని కుటుంబానికి ప్రభుత్వం కనీసం ₹25 లక్షల పరిహారం ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సైదులు కుటుంబానికి టి.పీ.టి.ఎల్.ఎఫ్ తరఫున దాన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందజేశారు. సైదులు కుటుంబానికి ఫెడరేషన్ పూర్తిగా అండగా ఉంటుందని నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్కే జానీ మియా, జిల్లా కార్యదర్శి ఎం. వీరయ్య, సఫియా, సైదులు, జానీ పాషా, సునీల్, అజ్జు, అజ్జు భాయ్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.