12-11-2025 09:01:57 AM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) నగేష్ గౌడ్ (30) గుండెపోటుతో మృతి చెందారు. ఆదిలాబాద్ లోని టీచర్స్ కాలనీలో నివాసముంటున్న సీఎంఓ నగేష్ గౌడ్ కు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా విషయం తెలుసుకున్న రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోర్ ఆసుపత్రికి చేరుకున్నారు. సీఎంఓ మృతి కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.