25 February, 2026 | 5:05 AM

వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

25-02-2026 01:33 AM

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివి 

మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావ్ 

మెదక్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలోని తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావ్ అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హవెలి ఘనపూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీలేదన్నారు.

గతంలో ఎన్నడూ లేని విదంగా మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. ఒకవైపు అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తూనే డెవలప్మెంట్ పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు తమ ప్రభుత్వంలో నిరంతర ప్రక్రియగా చేశామన్నారు. డ్వాక్రా మహిళలకు కోటిశ్వరులను చేయడమే లక్ష్యంగా వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.

మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ద్వారా డబ్బులు ఆదా చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద మెదక్ నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు రూ. 5 కోట్లు అందజేశామన్నారు. యాంత్రికరణ పథకం ద్వారా రైతులకు సబ్సిడీ పై వ్యవసాయ పరికరాలు అందజేసినట్లు తెలిపారు. ఒక్కొక్కటిగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఎడి విజయ నిర్మల హవెలి ఘనపూర్ తహసీల్దార్ సింధు రేణుక, మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మందుగుల గంగాధర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పరుశరామ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు అంజనేయులు గౌడ్, శంకర్ గౌడ్, దాయర రవి, హాఫిజ్, నాగిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.