12 May, 2026 | 1:23 AM

ప్రత్యేకావసరాల పిల్లలకు ప్రభుత్వ అండ

12-05-2026 12:00 AM
  1. వారికి సమానస్థాయిలో అవకాశాలు కల్పించాలి
  2. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

ఎల్బీనగర్, మే 11(విజయక్రాంతి): ప్రత్యేకావసరాల పిల్లలకు అన్నిరంగాల్లో సమాన స్థాయిలో అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రత్యేకావసరాలు కలిగిన పిల్లల (సీడ బ్ల్యూఎస్‌ఎన్) కోసం నిర్వహించిన ఏఎల్‌ఐఎంసీవో ఎయిడ్స్, ఉపకరణాల పంపిణీ శిబి రాన్ని సోమవారం సరూర్‌నగర్ జడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్ర త్యేకావసరాలు కలిగిన విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలు, సహాయక పరికరాల ను అందజేశారు. విద్యాభివృద్ధి, స్వయం ఆ ధారిత జీవనం, సాధారణ జీవన విధానం లో మరింత సౌలభ్యం కల్పించాలనే లక్ష్యం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారు లకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందన్నారు.

సమగ్ర శిక్ష తెలంగాణ ద్వారా వారికి అవసరమైన సేవలు, విద్యా సహా యం, ఉపకరణాలు అందించేందుకు ప్రభు త్వం మరింత కృషి చేయాలన్నారు. అనంతరం పలువురు చిన్నారులకు సహాయక పరి కరాలను స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.