12 May, 2026 | 1:25 AM

దేశం కోసం పోరాడిన చరిత్ర కాంగ్రెస్‌ది

12-05-2026 12:00 AM

అటువంటి పార్టీనే అవమానిస్తారా?

కాంగ్రెస్‌ను ఎంఎంసీగా పేర్కొంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై వీహెచ్ పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి) : మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు మావోయిస్టుల కారణంగా ప్రాణా లు కోల్పోయారని, దేశ స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింలు, కాంగ్రెస్ పాత్ర ఎంతో గొప్పదని ప్రభుత్వ సలహాదారు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అ న్నారు. అటువంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్ (ఎంఎంసీ)గా మోదీ పేర్కొనడం తగదన్నా రు.

‘వామపక్ష పార్టీల కంటే మరింత లెఫ్ట్ భావజాలం వైపు కాంగ్రెస్ పార్టీ వెళ్లిందని, మావోయిస్టు భావజాలంతో పాటు ముస్లిం లీగ్ మాదిరి మౌలికవాద ధోరణి అవలంభిస్తోందని, అందుకే ప్రజలు దానిని ఎంఎంసీ అని పిలుస్తున్నారు’ అని సికింద్రాబాద్ సభ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యా ఖ్యలపై వీహెచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆయన పార్టీ నాయకులతో కలిసి సోమవారం అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని అవమానించేలా ఉన్నాయన్నారు. అదే విధంగా జనగణన అంశంపైనా హనుమంతరావు స్పందించారు.