28 April, 2026 | 3:06 AM

ఆఫ్టర్ కేర్ పిల్లలకు ప్రభుత్వం అండ

28-04-2026 01:01 AM
  1. రాష్ట్ర చరిత్రలో రికార్డుస్థాయిలో 1,050 మంది పిల్లలకు ధ్రువీకరణ పత్రాలు
  2. మీ బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా
  3. ఆఫ్టర్ కేర్ పిల్లలకు మంత్రి సీతక్క హామీ

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ఆఫ్టర్ కేర్ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మహిళా సంక్షే మ శాఖ మంత్రి సీతక్క స్పష్టంచేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహి ళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చైల్ సేఫ్టీ ప్రొటెక్షన్ అండ్ సే నో టు డ్రగ్స్ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైల్ కేర్ ఇన్‌స్టిట్యూషన్లలో నివసిస్తున్న విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో భాగంగా ఆఫ్టర్ కేర్ విద్యార్థులకు ఆధార్, ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆరోగ్యశ్రీ కార్డులు వంటి కీలక పత్రాలను సీతక్క అందజేశారు. రాష్ట్ర చరిత్రలో రికార్డుస్థాయిలో 1,055 మంది పిల్లలకు ధ్రువీక రణ పత్రాలు మంజూరుచేశారు. ఈగల్ ఫోర్స్ తరఫున విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీచేశారు. అనంతరం సే నో టు డ్రగ్స్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రభు త్వ సంరక్షణలో ఉన్న ఆఫ్టర్ కేర్ పిల్లలు ఇకపై స్వతంత్ర జీవితంలోకి అడుగుపెడుతున్నారని తెలిపారు. వారి ఉన్నత విద్య, ఉపా ధి అవకాశాలకు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం స్వయంగా అంద జేస్తోందని చెప్పారు.

కుటుంబ ఆదరణ లేకపోయినా కష్టాలను అధిగమించి ఈ స్థాయి కి వచ్చిన విద్యార్థులను అభినందించారు. వారి భవిష్యత్తు భద్రంగా ఉండేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇ చ్చారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్‌రెడ్డి, సభ్యులు అపర్ణా చందన, సరిత, వందన, వచన్‌కుమార్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, మహిళా శిశు సంక్షే మ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి, ఈగల్ ఫోర్స్ అధికారులు గిరిధర్, పద్మజ పాల్గొన్నారు.