29 June, 2026 | 6:55 AM

ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి

13-06-2024 03:05 PM

పోలీస్ జాబ్ మేళాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, (విజయక్రాంతి): యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోగురువారం పోలీసుల ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళకు అది శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంబించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో 60కి పైగా కంపెనీలతో 1000 ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళ నిర్వహణకు కృషి చేసిన జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాగాన్ని విప్ అభినందించారు. మెగా జాబ్‌ మేళాకు ముందుగా అన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న సుమారు 8000 మంది యువత పెద్ద సంఖ్యలో మేళాకు తరలిరాగా, ఆరువైకి  పైగా వివిధ కంపెనీలకు చెందిన హెచ్‌.ఆర్‌లు వచ్చి యువతకు సంబంధించి విద్యార్హతలను బట్టి ఇంటర్యూలు నిర్వహించి సెలెక్ట్ అయినవారికీ తమ సంస్థల్లో పనిచేసేందుకు నియామక పత్రాలను అందించారు.