సంగారెడ్డిలో విషాదం.. కవల పిల్లలతో సహా చెరువులో దూకిన తల్లి
13-06-2024 03:18 PM
అమీన్‌పూర్: సంగారెడ్డి జిల్లాలో గురువారం విషాదం చోటుచేకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి అమీన్‌పూర్ పెద్దచెరువులో దూకింది. దంపతుల మధ్య గొడవ కావడంతో నిన్న అర్ధరాత్రి తల్లి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అనంతరం కవల పిల్లలు శ్రీహా, శ్రీహాన్స్ తో కలిసి తల్లి శ్వేత చెరువులో దూకింది. తల్లి శ్వేత, చిన్నారి శ్రీహాను అమీన్ పూర్ పెట్రోలింగ్ పోలీసులు రక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






