29 June, 2026 | 7:58 AM

ఆశా కార్యకర్తలకు న్యాయం చేయాల్సిందే

13-06-2024 03:02 PM

మహబూబ్​నగర్: ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధికారుల సమీకృత కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ  సందర్భంగా ఆశా కార్యకర్తలు పలు డిమాండ్లను తెలియజేశారు. ఆశాలకు నష్టం కల్గించే ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వం తక్షణమే ఉపసంహరించు కోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకనుగుణంగా ఆశాలకు ఇస్తున్న పారితోషికాలను రూ. 18,000/-లకు పెంచి, ఫిక్స్డ్ వేతనంనిర్ణయించాలన్నారు.

ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ రూ.50 లక్షలు చెల్లిస్తూ సర్క్యులర్ జారీ చేయాలని,రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలని, ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ చెల్లించాలని తెలిపారు. అనేక సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న రిజిస్టర్సున్న అత్యంత తొందరగా ప్రింట్ చేసి ఆశాలకు అందించాలని,జిల్లా అధికారులు ఆశాలతో స్ఫూటమ్ డబ్బాలను మోపించకూడదని పైనుండి నిర్ధిష్టమైన సర్క్యులర్ జారీ చేయాలని పేర్కొన్నారు. గతంలో ఇచ్చినట్లు ఆశాలకు ప్రతినెలా 2వ తేదీన పారితోషికాలు చెల్లించాలని, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు  ఖర్చులు రూ.50 వేలు చెల్లిస్తూ సర్క్యులర్ జారీ చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటనే ఆశాలకు రెస్ట్ రూం ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కురుమూర్తి, ఆశా కార్యకర్తలు యాదమ్మ, అనిత తదితరులు ఉన్నారు.