calender_icon.png 21 July, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండపోచమ్మను దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

21-07-2025 01:03:39 AM

జగదేవపూర్, జూలై 20: జగదేవపూర్ మండల పరిధిలోని కొండపోచమ్మ అమ్మవారిని  ఆదివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

కొండపోచమ్మ ఆలయ చైర్మన్ అనుగీత హరిప్రసాద్ ఆలయ పరిధిలోని కొన్ని సమస్యలను ఆయన దృష్టి కి తీసుకెళ్లగా మొదటగా తాగు నీటి సమస్య నివారణ కోసం వాటర్ ఫిల్టర్, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో  సోలార్ లైట్లు మంజూరు చేశారు.

త్వరలోనే దేవాలయ అభివృద్ధికి  ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డివిజనల్  ఇన్స్పెక్టర్  విజయ లక్ష్మి, ఈ.ఓ రవికుమార్, తాజా మాజీ సర్పంచులు రజిత రమేష్, భాను ప్రకాష్ రావు, డైరెక్టర్లు వెంకట్ రామ్ రెడ్డి, నరేష్, ఆశయ్య, సిబ్బంది కనుకయ్య,హరి బాబూ అర్చకులు లక్ష్మణ్, రమేష్  తదితరులు పాల్గొన్నారు.