21-07-2025 01:02:31 AM
చేగుంట, జూలై 20 : పేదవారు సైతం కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఐదు లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడం జరిగిందని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు, చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గెస్ట్ హౌస్ లో మండలంలోని పొలంపల్లి గ్రామానికి చెందిన చెందిన ఇద్దరు ఇటీవల ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఇద్దరు లబ్ధిదారులకు 65000 వేల రూపాయల మంజూరు చేసిన చెక్కులను ఆదివారం ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ వెంగల్ రావు, జనరల్ సెక్రెటరీ మహేష్, ఓబీసీ సెల్ అన్నం ఆంజనేయులు, ఎస్సీ సెల్ స్టాలిన్ నర్సింలు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, సాయి కుమార్ గౌడ్, సండ్రుగు శ్రీకాంత్ సీనియర్ నాయకులు పుర్ర ఆగం, అయిత పరంజ్యోతి,రాజగౌడ్ పాల్గొన్నారు.