6 April, 2026 | 9:13 PM

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి

07-12-2024 10:53 PM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు...

మణుగూరు (విజయక్రాంతి): రాష్ట్రంలోని మహిళల సంక్షేమ కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్ళగొమ్మూరు గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం 30 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. డ్వాక్రా మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారారూ. 6.77 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అన్నారు. మహిళల కొరకు అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ ముజాహిద్, ఎంపిడిఓ జమలా రెడ్డి, ఏపీవో నాగార్జున, బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.