6 April, 2026 | 7:23 PM

ఆటల్లో గెలుపోటములు సహజం

07-12-2024 10:48 PM

కబడ్డీ టౌర్నమెంట్ ముగింపులో ఎమ్మెల్యే అనిల్ జాదవ్..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): నెరడిగొండ మండలంలోని వడూర్ గ్రామంలో గత 10 రోజుల నుంచి నిర్వహిస్తున్న వైడూర్యపురం కబడ్డీ టౌర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా రెండు టీమ్ సభ్యులను పరిచయం చేసుకుని టాస్ వేసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. అనంతరం గెలిచిన జట్టుకు మొదటి బహుమతిగా వ్యక్తిగత డబ్బులు రూ.14 వేలను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువకులు క్రీడాలల్లో రాణించాలని క్రీడలతో మానాసికొల్లాసం ఉంటుందని అన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, కావున క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా యువకులు ఏ సహాయం కావాలన్న తనను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.