6 April, 2026 | 10:49 PM

క్రీడలు మానసిక ఉల్లాసానిస్తాయి

07-12-2024 11:05 PM

డిసిఎంఎస్ మార్క్ ఫైడ్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్...

పాల్వంచ (విజయక్రాంతి): క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరకదా ఆరోగ్యానికి దోహదపడతాయని డిసిఎంహెచ్ చైర్మన్ కొత్తవల శ్రీనివాస్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్‌ క్రీడా పోటీలకు పాల్వంచ మండలం స్థానిక మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయని క్రీడలు ఆడితే శారీరకంగా దృఢంగా ఉంటామని ఆయన అన్నారు. భద్రాద్రి జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ పరంధామ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి క్రీడాకారులు దేశస్థాయిలో ఆడడానికి నైపుణ్యం పొందాలని వారికి స్థానిక గ్రామాల్లో ఉన్న పాఠశాలల ఉపాధ్యాయులు సహకరించాలని అన్నారు. గ్రామస్థాయిలో ప్రతిభచాటిన క్రీడాకారులను ఈ నెల 10, 11, 12 తేదీల్లో మండల స్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేయనున్నారు.

జిల్లా స్థాయిలో నిర్వహించనున్న పోటీలకు మండల స్థాయిలో ప్రతిభచాటిన క్రీడాకారులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో 20 క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించి అక్కడ ప్రతిభ చాటే క్రీడాకారులను రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో జి వివేక్ ఎంపీడీవో బి నారాయణ ఎంఈఓ శ్రీరామ్మూర్తి ఏపీఓ రంగా, పాఠశాల హెచ్ ఎల్ రామారావు, స్పోర్ట్స్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం, పిఈటి అంజయ్య, రమేష్, సావిత్రి, గ్రామపంచాయతీలో సెక్రటరీలు, ఎక్స్ జెడ్పిటిసి ఎర్రంశెట్టి ముత్తయ్య కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, పాల్వంచ యూత్ ప్రెసిడెంట్ పైడిపల్లి మహేష్, ఎం.మహేశ్వరరావు, బి.నాగేశ్వర్, వై వెంకట్రావు, రిషి, చరణ్, శాంతి వర్ధన్, స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.