17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

విద్య, వైద్యంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి

07-02-2026 12:00 AM

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

ఎల్బీనగర్, ఫిబ్రవరి 6 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం ఆందిస్తే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితం అవుతుందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రకృతి వనరులను విధ్వంసం చేయకుండా ప్రకృతితో కలిసి జీవిస్తే వ్యాధులను నివారించొచ్చు.. ఆరోగ్యమైన మనుషులు ఉన్నప్పుడే.. దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుందని, తద్వారా వికసిత్ భారత్ సాధ్యమవుతుంది’ అన్నారు.

శుక్రవారం  మన్సూరాబాద్ డివిజన్‌లో ఏర్పాటు చేసిన ‘వెల్‌నాక్స్ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్’ ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఏపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, జీహెచ్‌ఎంసీ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహరెడ్డి, సెంటర్ ఎండీ డాక్టర్ స్వాతి ప్రత్తిపాటి, డాక్టర్ సిద్ధార్థ్ సాయి, కామినేని ఎండీ శశిధర్ , ఆర్‌ఎస్‌ఎస్ ఏపీ ప్రాంత సంఘ్‌చాలక్ సుందర్ రెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.