అజారుద్దీన్, కోదండరాం MLC పదవులకు లైన్ క్లియర్
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా(Telangana Governor Shiv Pratap Shukla) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు. గవర్నర్ కోటాలో అజారుద్దీన్, కోదండరాం మండలికి వెళ్లారు. గత ఏడాది ఆగష్టు 30న తీర్మానం చేసిన తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) గవర్నర్ కు పంపింది. గవర్నర్ శివ ప్రతాప్ శనివారం నాడు ఫైల్ పై సంతంకం చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై మూడేళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ నెల 30లోగా ఎమ్మెల్సీ కాకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి కోల్పోనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు త్వరగా తీర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల గవర్నర్ ను కోరారు.






