25 April, 2026 | 3:38 PM

మంత్రి వివేక్ పర్యటనలో రసాభాస

25-04-2026 01:50 PM
  1. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మంత్రి వివేక్ మధ్య వాగ్వాదం
  2. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ నినాదాలు
  3. బీఆర్ఎస్ నిర్వాకం వల్లే ఆర్టీసీ సమ్మె అన్న మంత్రి
  4. మహిళలకు 2500 హామీ ఏమైందని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే 

హైదరాబాద్: మెదక్ జిల్లా నర్సాపూర్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. సునీతా లక్ష్మారెడ్డి, మంత్రి వివేక్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళలకు రూ. 2500 పంపిణీపై ఎమ్మెల్యే మంత్రిని ప్రశ్నించారు. కేసీఆర్ వేల కోట్ల అప్పు చేశారని మంత్రి బదులిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్లే ఆర్టీసీ సమ్మె చేపట్టిందని వివేక్ స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ నినాదాలు చేశారు.