08-12-2025 01:56:04 PM
హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit)ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. గ్లోబల్ సమ్మిట్ కు హాజరైన గవర్నర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు గవర్నర్ ను ఆహ్వానించారు. గ్లోబల్ సమ్మిట్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సినీ నటుడు నాగార్జున, దేశ, విదేశాలకు చెందిన దిగ్గజాలు హాజరయ్యారు. విశ్వ యవనికపై తెలంగాణ ఖ్యాతి చాటేలా గ్లోబల్ సమ్మిట్( Global Summit)ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే సదస్సుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్జీటీ, టీజీఎస్సీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్లోబల్ సమ్మిట్‌కు డ్రోన్లతో నిఘా పెట్టారు. ఔటర్ రింగ్‌రోడ్ నుంచి ప్రధాన వేదిక వరకు డ్రోన్లతో నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ లో 44కుపైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. తెలంగాణ విజన్ రైజింగ్ డాక్యుమెంట్-2047ను రాష్ట్ర ప్రభుత్వం రేపు ఆవిష్కరించనుంది.