calender_icon.png 8 December, 2025 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ నేత మధుకర్ మృతికి కారకులను అరెస్టు చేయకపోతే ముట్టడితప్పదు

08-12-2025 02:23:51 PM

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బీజేపీ నేత ఏట మధుకర్ మృతికి కారకులను అరెస్టు చేయకపోతే బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు, బెల్లంపల్లి ఏసీపీ కార్యాలయాలను ముట్టడి చేస్తామని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్ హెచ్చరించారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే అనుచరులు రుద్రబట్ల సంతోష్,గాలి మధు, చింతకింద కమల వేధింపుల వల్లనే మధు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.

ఈ విషయాన్ని మధు తన మరణ వాంగ్మూలంలో తెలిపాడని చెప్పారు. ఇప్పటివరకూ నిందితుల్ని పోలీసులు  అరెస్టు చేయలేదని విమర్శించారు. నిందితులు అధికార పార్టీకి చెందిన వారు కాబట్టే పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిందితులను కాపాడుతున్నారని మండిపడ్డారు. బెల్లంపల్లి నియోజక వర్గంలో మొదటినుంచి రుద్రబట్ల సంతోష్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనీ మండిపడ్డారు. గతంలో శివరామ్ హత్య వెనుక రుద్రబట్ల సంతోష్ హస్తం ఉందన్న అన్నారు. అపుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే చెన్నూరు మంత్రిగా ఉన్నారని తెలిపారు.

ఎమ్మెల్యే గడ్డం వినోద్ మొదటి నుంచి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనీ తీవ్ర విమర్శలు చేశారు. నిందితులు పెట్టుకున్న ముందస్తు బెయిల్  ఫిటిషన్ కోర్టు కొట్టివేసినా కూడా పోలీసులు నిందితుల్ని  అరెస్టు చేయకుండా, వారికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైన పోలీసులు నిందితులను అరెస్టు చేసి చట్టాన్ని గౌరవించాలని హితవు పలికారు. ఈ  సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్ , పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి, బీజేపీ లీడర్లు సూరం సంపత్ కుమార్, కొంక సత్యనారాయణ, అంగిలిశేఖర్, గోమాస కమల పాల్గొన్నారు.