calender_icon.png 22 September, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట జిల్లా అధికారులకు గవర్నర్ ప్రశంస

22-09-2025 12:14:45 AM

  1. ఇరిగేషన్ డిఈఈ చెన్ను శ్రీనివాస్ రావు, 

తొగుట సీఐ ఎస్.కె.లతీఫ్ లకు సత్కారం

దౌల్తాబాద్, సెప్టెంబర్ 21:ప్రజలతో మమేకమై సేవలందించిన సిద్దిపేట జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయిలో సత్కారం పొందారు. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు అధికారులు చేసిన కృషిపై ఆశాగీతాంజలి ప్రతినిధి, ప్రముఖ రంజీ క్రికెటర్ నాగేంద్ర ఏడాదికి పైగా 31 జిల్లాల్లో 8,300 కి.మీ.ల మేర పర్యటించి ఉత్తమ సేవలందిస్తున్న అధికారులను గుర్తించారు.

తెలంగాణ గవర్నర్ జిశ్నుదేవ్ శర్మ, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయల చేతుల మీదుగా సిద్దిపేట జిల్లా నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెన్ను శ్రీనివాస్ రావు, తొగుట సీఐ ఎస్.కె. లతీఫ్ లు ప్రశంస పత్రాలు అందుకున్నారు.