19 May, 2026 | 4:51 PM

ఎంపీ గోడం నగేష్‌ను సన్మానించిన సిర్పూర్‌(యు) బీజేపీ నాయకులు

19-05-2026 04:00 PM

జైనూర్,సిర్పూర్(యు),(విజయక్రాంతి): సిర్పూర్(యు) మండల బీజేపీ నాయకులు పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్‌ను సోమవారం శాలువాతో సన్మానించి పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ ఉపాధ్యక్షుడు పేందుర్ గుణవంత్ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు వాగులు, వంకలు, చెలిమల నుంచి నీరు తెచ్చుకుంటున్నారని తెలిపారు. అలాగే పలు గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామాలకు బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, బోరుబావులు మంజూరు చేయాలని ఎంపీని కోరారు. దీనిపై ఎంపీ గోడం నగేష్ సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.