calender_icon.png 22 September, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్పాహారం పంపిణీ

22-09-2025 12:15:17 AM

సూర్యాపేట, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) :  అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు గురుస్వామి ఆధ్వర్యంలో మహాలయ అమావాస్య పురస్కరించుకొని  ఆదివారం పట్టణంలో అల్పాహారం పంపిణి చేశారు.

ఈ సందర్భంగా వివిధ చౌరస్తా లలో ఉంటు న్న అనాధలకు, వ్యాపార నిమిత్తం పట్టణానికి వచ్చిన వారికి అల్పాహారంను అందజే శారు. అనంతరం అయన మాట్లాడుతూ..  మహాలయ పక్షంలో పితృదేవత పూజ ఎంతో విశిష్టమైనదని గతించిన పితృదేవతలను తలుచుకొని వారి పేరున దాన ధర్మా లు, అన్నదానాలు నిర్వహిస్తే  పితృదేవతల అనుగ్రహంతో అందరికి మంచి జరుగుతుందన్నారు. ఈయన వెంట రంగు సాయి ప్రీతి, మణిదీప్తి ఉన్నారు.