21 May, 2026 | 2:41 AM

త్వరలో ఉన్నత విద్యపై గవర్నర్ సమీక్ష

21-05-2026 12:00 AM

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): త్వరలో రాష్ట్రంలోని వర్సిటీల వీసీలు, తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులతో ఉన్నత విద్య, వర్సిటీల్లోని సమస్యలపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా సమీక్షించనున్నారు. బుధవారం లోక్‌భవన్‌లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డితో ఉన్నత విద్య లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, చేపట్టవలసిన సంస్కరణలపై గవర్నర్ చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ (ఛాన్స్‌లర్‌గా) తక్షణం జోక్యం చేసుకోవాల్సిన వర్సిటీల్లోని అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి తనకు సమర్పించాలని బాలకిష్టారెడ్డిను గవర్నర్ ఆదేశించారు.