జూలై 6న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్ సమావేశం
03-07-2024 05:42 PM
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ కౌన్సిల్, స్టాండింగ్ కమిటీ సమావేశం జూన్ 6వ తేదీన జరుగనుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి కాట బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టాండింగ్ కమిటీ సమావేశంపై అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం.
కౌన్సిల్ సమావేశం సాఫిగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ సమావేశం దాదాపు ఐదు నెలల విరామం తర్వాత జరుగుతోంది. జీఐఎస్ ఆధారిత సర్వే, నగరంలోని ఆస్తుల మ్యాపింగ్, అన్నపూర్ణ బోజనం, ఎల్బీ నగర్ లో ఫ్లైఓవర్ తో సహా మొత్తం 12 ప్రతిపాదనలు చర్చలకు రానున్నాయి.






