31 March, 2026 | 10:09 PM

కేసు వాదిస్తుండగానే న్యాయవాదికి గుండెపోటు

18-02-2025 04:18 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ హైకోర్టులో విషాదం నెలకొంది. హైకోర్టులో కేసు వాదిస్తుండగా ఓ న్యాయవాదికి గుండెపోటు వచ్చిన ఘటన మంగళవారం జరిగింది. పసునూరు వేణుగోపాలరావు అనే న్యాయవాది కోర్టు హాలులోనే కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన జడ్జి, ఇతర న్యాయవాదులు బాధిత న్యాయవాదిని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. న్యాయవాదిని పరీక్షించిన వైద్యులు అప్పటికే వేణుగోపాలరావు మృతి చెందినట్లు ధృవీకరించారు. దీంతో ఆయనకి సంతాపంగా 21వ కోర్టు హాల్ లో న్యాయమూర్తి విచారణ నిలిపివేశారు. మిగిలిన కోర్టు హాళ్లలోనూ రెగ్యూలర్ పిటిషన్లు వాయిదా వేశారు. న్యాయవాది మృతిపట్ల హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.