గౌడ కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి
హుజూర్ నగర్: గౌడ కులస్తులు ఐకమత్యంగా ఉంటూ అన్ని రంగాల్లో రాణించాలని గౌడ ఉద్యోగ సంక్షేమ సంఘ(Gowda Employment Welfare Association) జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ రామ్మూర్తి అన్నారు. శనివారం హుజూర్నగర్ పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్లో హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించిన , పదవ తరగతి ,ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన గౌడ విద్యార్థులను గౌడ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భం వారు మాట్లాడుతూ... గౌడ విద్యార్థులు చిన్నతనం నుండే లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ నియోజకవర్గ గౌడ పెద్దలు దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ,కాంపాటి రాధాకృష్ణ , తుమ్మల శ్రీనివాస్ గౌడ్ మొక్కరమేష్ గౌడ్, పెండెం రాంబాబు గౌడ్, వెలుగూరి కిరణ్ గౌడ్, మేకపోతుల శ్రీనివాస్ గౌడ్, మైసయ్య గౌడ్,సత్యనారాయణా గౌడ్, యరగని శ్రీనివాస్ గౌడ్, యరగని సత్యనారాయణ గౌడ్, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.






