ఉపసర్పంచ్ సంతకం లేకుండానే జీపీ నిధులు డ్రా
సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు
ధర్మపురి,జూలై20 (విజయక్రాంతి): ఉప సర్పంచ్ అయిన తన యొక్క సంతకం లేకుండానే గ్రామపంచాయతీ యొక్క నిధులను గ్రామ సర్పంచ్ ఐత తిరుపతి, పంచాయతీ కార్యదర్శి అజిత్ లు అక్రమంగా డ్రా చేశారాంటూ వెల్లటూరు మండలం రాoనూరు గ్రామ ఉప సర్పంచ్ ఎంబడి మహేష్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ వెల్గటూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారికి ఇట్టి విషయంపై ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.
ఇట్టి అంశాన్ని ఎంపీడీవో మండల పంచాయతీ అధికారి కి విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారనీ, ఎంపీవో దొండ కృపాకర్ విచారణ చేపట్టాల్సింది పోయి ప్రజా ప్రతినిధిని అయిన నన్ను విధించేలా అసభ్యకరంగా మాట్లాడారనీ ఆయన పేర్కొన్నారు.గత్యాంతరం లేక సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. డ్రా చేసిన నిధుల్లో అక్రమాలు ఉన్నందునే తాను సంతకం చేసేందుకు నిరాకరించాననీ ఉప సర్పంచ్ తెలిపారు. అయినప్పటికీ గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి లు కలిసి నిధులు డ్రా చేసుకున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు గ్రామ పంచాయతీ నిధులపై సమగ్ర విచారణ జరిపి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ ఆయన కోరారు.
విచారణ చేపడుతాం...!ఎంపీవో దొండ కృపాకర్
రాoనూర్ గ్రామపంచాయతీ నిధుల డ్రా అంశము తమ దృష్టికి వచ్చింది వాస్తవమే. ఫిర్యాదుదారుడు అయిన ఉపసర్పంచ్ కు సంబందించిన అంశంపై విచారణ చేపడతాం అని తెలిపినప్పటికీ సంయమనం పాటించలేదు. మరలా వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై తప్పకుండా విచారణ చేపడతాo.ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం.






