మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి..
ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి: డీఎస్పీ నాగేంద్రచారి
తంగళ్ళపల్లి జూలై 20 (విజయ క్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాళ్లపల్లి మండలంలోని వ్యవసాయ కళాశాలలో తెలంగాణ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. మాదకద్రవ్యాలు వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు.
విద్యార్థుల ప్రవర్తన, కదలికలపై అధ్యాపకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ విక్రయం, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు లేదా తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్లైన్ 8712671111కు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఈగల్ టీమ్ డీఎస్పీ ఉపేందర్, ఎస్‌ఐ ఉపేందర్ చారి, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.






