గెలుపు కోసం ముందస్తు వ్యూహం

05-10-2026 | 05:30am

రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్.. ఆరు నెలల ముందుగానే అభ్యర్థుల ప్రకటన

  1. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు కీలక మంత్రులు 
  2. మిగతా పార్టీల కంటే ముందే ప్రచారంలోకి వెళ్లాలని యోచన 
  3. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇన్‌చార్జ్‌ల నియామకానికి కసరత్తు

అక్టోబర్ 4 (విజయక్రాం తి): త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను(Graduate MLC Elections) అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ రెండు సీట్లను దక్కించుకునేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే నల్లగొండొ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డిని,

హైదరాబాద్‌గి రంగారెడ్డిటె మహబూబ్‌నగర్ గ్రా డ్యుయేట్ నియోజకవర్గానికి పార్టీ యువ నాయకుడు సామా రామ్మోహన్‌రెడ్డిని అభ్యర్థులుగా ఖరారు చేసింది. ఈ రెం డు పట్టభ ద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఆరు ఉ మ్మడి జిల్లాల్లో, పదకొండు లోక్‌సభ సెగ్మెంట్లలో, 77 అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తరించి ఉ న్నాయి. దీంతో ఈ ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపించనున్నాయి.

అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు ఉమ్మడి నల్లగొండలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమ్మడి ఖమ్మంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరా వు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్‌లో మంత్రి సీతక్క, ఉ మ్మడి మహబూబ్‌నగర్ లో మంత్రులు వాకిటి శ్రీ హరి, జూపల్లి కృష్ణారావు ఉం డగా.. హైదరాబాద్ జిల్లా నుంచి మంత్రి అజారుద్దీన్ ఈ రెండు గ్రా డ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల పరిధిలోనే ఉన్నారు.

ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో.. ఇన్‌చార్జ్ మం త్రిగా ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు ఉమ్మడి రం గారెడ్డి జిల్లా విషయంలో కీలకంగా వ్యవహారించనున్నారు. ఆయా జిల్లాల మంత్రుల తో పాటు ఇన్‌చార్జ్ మంత్రులుగా ఉన్న పొన్నం ప్రభాకర్ (హైదరాబాద్), దామోదర రాజనరసిం హ (మహబూబ్‌నగర్ ), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (నల్లగొండ), వాకిటి శ్రీహరి (ఖమ్మ ం), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్ ) కూడా పట్టభద్రుల ఎన్నికలపైన పూర్తి స్థా యిలో దృష్టి సారించనున్నారు. 

అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్! 

రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఆరు నెలల ముందుగానే.. మిగతా పార్టీల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ప్రధానంగా బీఆర్‌ఎస్, బీజేపీ ఇంకా అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం నల్లగొండ వరంగల్  ఖమ్మం నియోజకవర్గం నుంచి తీన్మార్ మల్లన్న ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఆ తర్వాత తీన్మార్ మల్లన్న కాంగ్రెస్‌ను వీడి..

ఇప్పుడు సొంతగా రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. ఇక హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్‌నగర్ నియోజక వర్గం నుంచి ప్రస్తుతం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తీన్మార్ మల్లన్న, వాణిదేవి పదవీ కాలం వచ్చే మార్చి నెలలో ముగుస్తుంది. ఆలోపే ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఈ రెండు నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలని రాజకీయ పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు రెండేండ్ల ముందు పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటంతో..

రాజకీయ పార్టీలన్ని ఈ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి. ఈ ఫలితాల్లో ఏమాత్రం తేడా వచ్చినా భవిష్యత్ ఎన్నికలపైన ప్రభావం ఉంటుందని, వాటికి చెక్ పెట్టే విధంగా ప్రచారంలో దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. ఎమ్మెల్సీ టికెట్లు ఆశించి భంగపడిన నేతలతో  పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీకి చేసిన సేవలను గుర్తుంటాయని, భవిష్యత్‌లో మం చి పదవులు వస్తాయని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయం కోసం పని చేయాలని బుజ్జగించారు. 

అక్కడ మెజార్టీగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలే..!

అభ్యర్థుల ప్రకటన పూర్తయినందున పట్టభద్రులైన ఓటర్ల నమోదుతో పాటు ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి..  ప్రతి ఓటరును టచ్ చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించే ఆలోచన చేస్తున్నది.

నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 34 మంది ఎమ్మెల్యేలకు గాను 32 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక ఐదుగురు ఎంపీలు కూడా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 43 అసెంబ్లీ నియోజక వర్గాలు, ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా, ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌కు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖైరతాబాద్ ఖాళీ అయింది.

రెండు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, ఎంఐఎం పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏడింటిలో కాంగ్రెస్, మరో ఏడింటిలో బీఆర్‌ఎస్  ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడి రెండు లోక్‌సభ నియోజక వర్గాల్లో బీజేపీ ఎంపీలే ఉన్నారు. 

ఇక పాలమూరు జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. ఇప్పుడు వీరందరికీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకం కానున్నాయి. అభ్యర్థుల గెలుపు కోసం కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.  


మరిన్ని వార్తలు