ఘనంగా పట్టభద్రుల దినోత్సవం
కాకతీయ ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో పట్టాలందుకున్న 2022 విద్యార్థినులు
నిజామాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): కాకతీయ ఇంజినీరింగ్ మహిళా కళాశాల 2022 ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థినులకు శ్రీరామ గార్డెన్‌లో పట్టభద్రుల దినో త్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ యూని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి పాల్గొని విద్యార్థినులకు పట్టాలను అందచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని, సామర్థ్యాలను పెంపొందించుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. కళాశాల డైరెక్టర్ చెరుకూరి రజీనకాంత్ మాట్లాడుతు.. అత్యధిక విద్యార్థులు ఉన్నత సంస్థల్లో ఉద్యోగాలు పొందడం కళాశాలకు ఎంతో గర్వకారణమన్నారు.
ప్రిన్సిపాల్ సెల్వాకుమార్ రాజా మాట్లాడుతు.. విద్యార్థినులు కళాశాల నుంచి వెళ్లాక తల్లిదండ్రులకు, సమాజానికి గర్వకారణంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ జి. సాయారెడ్డి, వివిధ శాఖల అధిపతులు, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






