23 April, 2026 | 3:37 AM

ప్రగతి విద్యానికేతన్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

23-04-2026 01:39 AM

అశ్వాపురం, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి):  అశ్వాపురం మండలం మల్లెలమడుగులోని ప్రగతి విద్యానికేతన్లో బుధవారం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ జి. ఈశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో కరెస్పాండెంట్ సానికొమ్ము చైతన్య ముఖ్య అతిథిగా హాజరై, ఫౌండర్ కీర్తిశేషులు సానికొమ్ము బ్రహ్మరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ ఎస్. లక్ష్మి ప్రసన్న, ప్రిన్సిపాల్ జి. ఈశ్వర్ విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాలు అందిస్తూ విద్య ప్రాముఖ్యత, క్రమశిక్షణ, భవిష్యత్ లక్ష్యాల సాధనపై వివరించారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందడంతో పాటు వారి సృజనాత్మకతకు వేదిక కల్పించబడిందని కరెస్పాండెంట్ సానికొమ్ము చైతన్య, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు