23 April, 2026 | 3:22 AM

రహదారి బురదమయం

23-04-2026 01:37 AM

ములకలపల్లి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రంగాపురం గ్రామంలోని రహదారి బురదమయంగా మారిందని సిపిఎం సీనియర్ నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో ఇండ్లలోని మురికి నీరు వీధిలో చెరి మురికిమయంగా మారి ప్రజలు,పిల్లలు రహదారిపై నడిచే పరిస్థితి లేదని తెలిపారు. పంచాయితీ కార్యదర్శికి అనేక మార్లు తెలియచేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు.

వీధి మీద నీరు నిలవ ఉండడం వల్ల చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వీధిలో నీరు నిలువ ఉండడంతో ప్రజలు అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సున్నం చిరంజీవి, అన్నపూర్ణ, గడ్డం జ్యోతి బాస్, వగ్గేల కన్నయ్య,లచ్చిరామ్, తదితరులు పాల్గొన్నారు.