17 April, 2026 | 8:26 PM

Breaking News

ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •   ఎర్రకుంట స్మశాన వాటికలో చెట్ల తొలగింపు   •  

ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేయాలి

08-05-2025 01:28 AM

కొనుగోలు కేంద్రాల తనిఖీలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ముత్తారం, కాల్వశ్రీరాంపూర్, మే 7 : జిల్లాలో యాసంగి పంట కొనుగోలు లో కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. బుధవారం కలెక్టర్ ముత్తారం  మండలంలోని ముత్తారం, మచ్చుపేట, పారుపల్లి, కాల్వ  శ్రీరాంపూర్ మండలం లోని శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్, పెద్దరాత్ పల్లి  గ్రామాలలో  ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా జరగాలన్నారు.  కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. ముత్తారం మండల కేంద్రంలో జరుగుతున్న వరంగల్ -మంచిర్యాల జాతీయ రహదారి సి.ఎన్.జి పనులను కలెక్టర్ పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న చెల్లింపులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపిడిఓ సురేష్, కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్ జగదీష్ రావు, డిప్యూటీ తహసిల్దార్ శంకర్, ఏ.డి.ఏ అంజని, అధికారులు పాల్గొన్నారు.