08-05-2025 01:26:20 AM
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): తెలంగాణ, ఏపీ నుంచి అయోధ్య శ్రీరామమందిరం, కాశీవిశ్వనాథ ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, తెలుగు భక్తుల కోసం ప్రత్యేక వస తుల కల్పనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఎంపీ డా. కే లక్ష్మణ్ బుధవారం లక్నోలో వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో భక్తులకు తక్కువ ధరలకు సురక్షితమైన వసతి, భోజన, పార్కింగ్, మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లను అందిం చాల్సి ఉందని తెలిపారు.
కనీసం 2000 చదరపు గజాల నుంచి 1 ఎకరం వరకు స్థలం కేటాయించాలని కోరారు. భూమిని కేటాయించిన తర్వాత, అవసరమైన వసతుల నిర్మాణాన్ని తన ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా లేదా సీఎస్‌ఆర్ సహా ఇతర నిధుల సహాయంతో చేపడతామని ఆయన సీఎంకు తెలిపారు.
ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చే భక్తులు అధికసంఖ్యలో ఉండటంతో, వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ఈ విషయంపై యూపీ సీఎం సానుకూలంగా స్పందించారని లక్ష్మణ్ తెలిపారు. మన భక్తుల యాత్రను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.