08-05-2025 01:29:27 AM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, మే7 (విజయక్రాంతి): భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా గర్వపడుతున్నానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేది కాదని బుధవా రం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో ఆయన చెప్పారు.
ఈ విష యంలో పాజిటివ్‌గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయన్నారు. భారత సైన్యం ఎంత విరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ అన్నారు. దేశ రక్షణలో మేమెవరికి తీసిపోము అన్నట్టుగా వారికి శక్తి సామర్ద్యాలుండాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానని ఆయన తెలిపారు.