28 April, 2026 | 1:53 AM

నత్తనడకన ధాన్యం కోనుగోలు

28-04-2026 12:09 AM
  1. కొత్త నిబంధనతో ఇబ్బంది పడుతున్న రైతులు
  2. గ్రేడ్ కేటాయింపులో మిల్లర్ల పెదవి విరుపు
  3. మిల్లులో ధాన్యం అన్లోడ్ లో జాప్యం..  రైతులకు తప్పని తిప్పలు
  4. లారీల కొరత.. కేంద్రాలలో రైతుల పడిగాపులు 
  5. సుతిల్ దారాలు రైతులే కోనుగోలు చేస్తున్న వైనం

కోహెడ, ఏప్రిల్ 27: మండలంలో వరి ధాన్యం కోనుగోళ్లు నత్తనడకన కోనసాగుతున్నాయి. యాసంగి వరి ధాన్యం కోనుగోలుకు ప్రభుత్వం ఐకేపి ద్వార కేంద్రాలు ఏర్పాటు చేసింది. మహిళ సంఘాల నిర్వహకులు కేంద్రాలలో వరి ధాన్యం తూకం చేసి కేటాయించిన రైస్మిల్లర్లకు తరలించినప్పటికి ధాన్యం అన్లోడ్ లో జాప్యం కోనసాగుతుంది. ఈ నేపథ్యంలో రైతులకు కేంద్రాలలో నిరీక్షణ తప్పడం లేదు.

డేటా ఎంట్రీలో సాంకేతీక అంత:రాయలు

ధాన్యం కొనుగొలు చేసే సమయంలోనే అప్పటికప్పుడు టాబ్ లో రైతుల పంట, భూమి విస్థీర్ణం తదితర వివరాలతో పాటుగా ప్రభుత్వ సగటు నాణ్యత ప్రమాణాలు (FAQ Norms) ధాన్యం గ్రెడ్ ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తరచుగా సాంకేతీక అంత:రాయలు జగరడం, వాతావరణ మార్పులతో ఐకేపి నిర్వహకులు, రైతులు ఆందోళనకు గురైతున్నారు. 

జీపీఎస్ ఉన్న లారీలకే ధాన్యం లోడింగ్ కు అనుమతి 

ప్రభుత్వం చేపట్టిన నూతన జీపీఎస్ ప్రమాణాల ద్వార లారీల కొరత తీవ్రమైంతుందని.. అధికారులు సైతం లారీలను సెంటర్లకు పంపడం ఇబ్బందిగా మారుతుందని తెలిసింది. జీపీఎస్ ట్రాకింగ్ ఉన్న వావాహాలు మాత్రమే ధాన్యం లోడింగ్ కోసం వినియోగించాలని ప్రభుత్వం నుంచి అధికారులకు అదేశాలు ఉన్నాయి. దీంతో లారీల కొరత అధికమైయి తూకం వేసిన ధాన్యం కేంద్రాలలో రోజుల తరబడి నిల్వ ఉంటుందని సమాచారం. జీపీఎస్ ట్రాకింగ్ నిబంధనలు సంబందిత శాఖకు చెందిన అధికారులు ముందస్తుగా లారీ, డీసీఎం వాహనదారులకు అదేశాలు జారీలో విఫలమైయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఆటోమేటిక్ మిల్లు కేటాయింపు

లారీలో ధాన్యం లోడ్ చేసే సమయానికి మిల్లు కేటాయింపు సిస్టమ్ లో జనరేట్ అవుతుంది. ట్రక్ చిట్లో వచ్చిన మిల్లుకు ధాన్యం తరలించల్సి ఉంది. మిల్లు యాజమానులు ధాన్యం ఆన్ లోడ్ చేసుకునే క్రమంలో ధాన్యం సైజు తక్కవగా ఉందని ఎఫ్ సి ఐ కి పాస్ అవ్వదని గ్రెడ్ 2 కింద తీసుకుంటామని కేంద్రాల నిర్వహకులకు ఫోన్ చేసి రైతుల అభిప్రాయంలో ఒత్తిడికి గురిచేస్తు ధరలో కొరివి పెటుతున్నారని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేశారు. 

కేంద్రాలలో సైతం ధాన్యం తూకం చేసిన తర్వాత గన్ని సంచులు కుట్టు వేసేందుకు సైతం సుతిల్ దారం తామే తెచ్చుకుంటున్నామని,హమాలీలకు లారీ లో లోడ్ చేసినందుకు బస్తా కోకంటికి అదనంగా రూపాయి చెల్లెస్తు ఆర్థికంగా నష్టపోతున్నమని రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో కొత్త నిబంధనలతో రైతులు ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడికి గురైతున్నారు.