బేగంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
22-04-2026 08:24 PM
రామగిరి,(విజయక్రాంతి): రామగిరి మండలం బేగంపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు బుధవారం ప్రారంభించారు. రైతంగానికి మేలు చేయడమే ప్రభుత్వ సంకల్పమని రైతును రాజు చేయడమే లక్ష్యంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు పని చేస్తున్నారని బేగంపేట గ్రామంలో రైతులకు ధాన్యం ఆరబెట్టడం కొరకు విస్తృత స్థాయిలో భూమిని చదును చేసి బేగంపేట రైతంగాని అప్పగించారని మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా చివరి గింజ వరకు ధాన్యాన్ని కొంటామని చైర్మన్ వైనాల రాజు పేర్కొన్నారు.






