22 April, 2026 | 9:38 PM

రైతును రాజు చేయటమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం

22-04-2026 08:26 PM

ప్రభుత్వ విప్ ,పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రైతును రాజు చేయటమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్, వ్యవసాయ మార్కెట్, మండలంలోని  కదంబపూర్, సుద్దాల, రేగడి మద్దికుంట గ్రామాలలో సింగిల్ విండోల ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన  ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ  అలాగే రైతుల వివిధ రకాల ధాన్యానికి సంబంధిత రేట్లను సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి దాన్యపు గింజ కొనుగోలు చేస్తామని ఆ బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.