22 April, 2026 | 9:32 PM

మారణాయుధాలతో సంచరిస్తున్న పాత నేరస్తులు అరెస్ట్

22-04-2026 08:22 PM

ఉప్పల్,(విజయక్రాంతి): మారణాయుధాలతో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న  ముగ్గురు పాత నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కమాన్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా సంచరిస్తున్నారని సమాచారం మేరకు ఉప్పల్ సబ్ ఇన్స్పెక్టర్ ఈదయ్య తన సిబ్బందితో అక్కడ చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.

విచారించగా  దాసరి సురేందర్, ఆదిత్య ఠాగూర్ సింగ్, కన్నగా గుర్తించారు  2024లో దాసరి సురేందర్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసులో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తనిఖీలు చేయగా వారి నుండి ఎయిర్ గన్ రివాల్వర్   ఆరు బుల్లెట్లు  గొడ్డలి కత్తి ఐరన్ రాడ్ ను  గుర్తించారు.  2024 కేసులో  పురుషోత్తమ అనే వ్యక్తి  నుండి తనకు ప్రాణ భయం ఉండడం వలన  ఆయుధాలు సమకూర్చుకున్నట్లు   నిందితుల పేర్కొన్నారు. తన స్నేహితుడైన సాకేత్ ఎయిర్ గన్ సమకూర్చినట్లు నిందితులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించారు. ఎయిర్ గన్ సమకూర్చినట్లు  సాకేత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు