1 May, 2026 | 2:16 PM

Breaking News

సింగరేణి ఏరియాలో ఎఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా మేడే దినోత్సవం   •   దురాక్రమణ యుద్ధ భారాలకు వ్యతిరేకంగా, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కై ఉద్యమిద్దాం   •   మేడే స్ఫూర్తితో కార్మికులు హక్కుల సాధనకై ఉద్యమించాలి   •   కళ్యాణం కమనీయం   •   తెలంగాణ పోలీస్ దేశంలోనే నెం.1: డీజీపీ సీవీ ఆనంద్   •   నిజామాబాద్ జిల్లాలో రోడ్డెక్కిన రైతన్నలు.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం   •   విహార నౌక బోల్తా: తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య   •   జడ్చర్లలో దారుణం... చెట్ల పొదల్లో శిశువు మృతదేహం   •   డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్   •   కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు   •  

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

27-04-2026 08:20 PM

సర్పంచ్ తాలూకా మహేశ్వరీ, సాయిబాబా

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల పరిధిలోని చందాయిపేట్,  గ్రామం లో సొసైటీ  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం సొసైటీ సి ఈ ఓ సంతోష్ కుమార్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ముఖ్యంగా సన్న రకం వడ్లకు ప్రభుత్వం క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ అందిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.