17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి

18-10-2025 12:00 AM

జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 17(విజయ క్రాంతి):: 2025-26 ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో  ఆర్డీవో లోకేశ్వర్ రావు తో కలిసి జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణాధికారు లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యదర్శులు, ఐకెపి ఏపిఎంలు, సిసిలు, విఓ ఏలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ (వానాకాలం) సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సంబంధిత శాఖల సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. జిల్లాలో సుమారుగా 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, దాదాపు 30 వేల టన్నుల ధాన్యంను రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 24వ తేదీలోగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, 40 కొనుగోలు కేంద్రా లు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.

వరి ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాలుకు 2 వేల 389 రూపాయలు, సాధారణ రకానికి 2 వేల 369 రూపాయలు మద్దతు దడగా నిర్ణయించడం జరిగిందని, సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ అందించడం జరుగుతుం దని తెలిపారు. రైతులు ధాన్యా న్ని ఆరబెట్టుకుని తేమ శాతం నిబంధనలకు లోబడి ఉండేలా చూసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

కొనుగోలు కేంద్రాలను ఎత్తు ప్రదేశంలో ఏర్పాటు చేయాలని, దొడ్డు రకం, సన్న రకం ధాన్యాలను కొనుగోలు చేసేందుకు వేరువేరు కేంద్రాలు ఏర్పాటు చేయా లని, గన్ని సంచులను సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. టార్పాలి న్ కవర్లు, ప్యాడి క్లీనర్లు, డ్రయ్యర్లు, తేమశాతం యంత్రాలు ఎలక్ట్రానిక్ తూకం యం త్రాలు, ట్యాబ్ లను అందుబాటులో ఉంచి రైతుల వద్ద నుండి క్రమ పద్ధతిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా త్రా గునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని, తూకం వేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం ట్యాగింగ్ చేయబడిన రైస్ మిల్లులకు మాత్రమే తరలించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు.

రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణం లో వరి ధాన్యం కొనుగోలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.