29 May, 2026 | 4:23 AM

ధాన్యం నిల్వలు వెంటనే గోదాములకు తరలించాలి

29-05-2026 02:20 AM

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

భైంసా  (విజయ క్రాంతి)జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను గడువులోగా పూర్తి చేసి, నిల్వలను వెంటనే గోదాములకు తరలించే విధంగా అధికారులు చర్యలు చేప ట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. గురువారం కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు అర్లీ కె శ్రీ ఆంజనేయ స్వామి రైస్ మిల్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు తీరును, నిల్వల పరిస్థితిని, రికార్డులను పరిశీలించారు.

ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారో, ఇంకా ఎంత కొనుగోలు చేయాల్సి ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేపడతామని రైతులకు భరోసా ఇచ్చారు.కొనుగోలు చేసిన ధాన్యపు సంచులను ఎప్పటికప్పుడు గోదాములకు, రైస్ మిల్లులకు తరలించేందుకు తగినన్ని లారీలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

లా రీల కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్ల ద్వారా కూడా ధాన్యాన్ని తరలించేలా చర్య లు చేపట్టాలని సూచించారు.అనంతరం అర్లీ కె శ్రీ ఆంజనేయ స్వామి రైస్ మిల్ను సందర్శించిన కలెక్టర్, అక్కడ జరుగుతున్న అనో డింగ్ ప్రక్రియను పరిశీలించారు. రైస్ మిల్లు ల సామర్థ్యం, ఇప్పటివరకు దిగుమతి అయి న ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చే వాహనాలు నిలిచిపోకుండా వెంట వెంటనే అన్లోడింగ్ పూర్తి చేసి తిరిగి కేంద్రాలకు పంపించాలని సూచించారు. అవసరమైతే అదనపు హమాలీలను నియమించుకోవాలని మిల్లుల నిర్వాహకులకు తెలిపారు. అలాగే మిల్లుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

కేంద్రంలో ఉన్న రైతులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి, మొక్కజొన్న, జొన్న పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతగా పనిచేసి గడువులోగా కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

అనంతరం కల్లూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో ధాన్యం నిల్వలపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహిం చారు. గడువులోగా నిల్వలను గోదాములకు తరలించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ధాన్యం మెట్రిక్ టన్నుల వివరాలను అడిగి తెలుసుకుని రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, కుంటాల తహసిల్దార్ కమల్ సింగ్, ఎంపీడీవో అల్లాడి వనజ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.