6 June, 2026 | 1:44 AM

గ్రామ పంచాయితీ అభివృద్ధికి గ్రామసభ.. పాలకవర్గం

06-06-2026 12:02 AM

సత్తుపల్లి, జూన్ 5 (విజయక్రాంతి): కొత్తూరు గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసమే, గ్రామ సభను ఏర్పాటు చేసినామని పాలకవర్గ సభ్యులు సర్పంచ్ అయినంపూడి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ గొర్లమారి రామ్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఎంపీడీవో చిన్న నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తూరు గ్రామపంచాయతీలో గ్రామసభను ఏర్పాటు చేశారు.

ఈ గ్రామ సభకు అన్ని శాఖల అధికారులు హాజరైనారు. ఈ సందర్భంగా తాసిల్దార్ లక్ష్మీ మాట్లాడుతూ జనాభా లెక్కల్లో ప్రతి ఒక్కరూ సహకరించాలని, రైతులు భూ సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఎలక్ట్రికల్ ఏఈ శరత్ మాట్లాడుతూ ఇంటి మీద ఉన్న కరెంటు వైర్లను తొందర్లోనే ప్రభుత్వానికి నివేదిక పంపించి పరిష్కరిస్తామని, మిడ్ పోల్స్ ఏర్పాటు చేస్తామని, రాబోయే వర్షాకాల దృశ్య విద్యుత్ స్తంభాలకు షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి, జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు.

హౌసింగ్ ఏఈ మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి ఇప్పటివరకు 67 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేశామని, లబ్ధిదారులకు ఫైనల్ బిల్లు కూడా అందజేసి, అభివృద్ధికి మా సహాయ సహకారాలు అందించామన్నారు. ఐకెపికి నూతన బిల్డింగ్ మంజూరు అవటం, శంకుస్థాపన చేయటం అభినందనీయమని, రాబోయే వర్షాకాల దృష్ట్యా పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి కొనసాగిస్తామని, డ్రైనేజీలు, పంచాయతీలో బ్లీచింగ్ చల్లించటం, దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సమిష్టిగా కృషిచేసి పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ పద్మ,పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు ఉన్నారు.