6 June, 2026 | 1:42 AM

కాంగ్రెస్‌లో వర్గ పోరు

06-06-2026 12:00 AM

టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కు కాంగ్రెస్ నేతల మొర

తూప్రాన్, జూన్ 5: తూప్రాన్ డివిజన్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు అంతర్గత అసం తృప్తి మరోసారి రుజువైంది. గతంలో జరిగి న మార్కెట్ కమిటీలు, పార్టీ పదవుల నియా మకాలపై తీవ్ర అసంతృప్తితో తూప్రాన్ డివి జన్, మండల కాంగ్రెస్, అధ్యక్షులు, సర్పం చులు, ఎంపీటీసీ లు, సీనియర్ నాయకులు నేరుగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను, మంత్రి వివేక్ ను ప్రత్యేకంగా కలిసి తమకు జరుగుతున్న అన్యాయం పై వివరిం చారు. అహర్నిశలు పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను పక్కనపెట్టి, కొందరి సూచనల మేరకే మార్కెట్ కమిటీలు, ఇతర నామి నేటెడ్ పదవులు ఇచ్చారని సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.