10 June, 2026 | 8:09 PM

ఆర్.కొత్తగూడెంలో గ్రామసభ

10-06-2026 06:53 PM

వ్యర్థాల వేరుపై అవగాహన, ప్రజాప్రతినిధులకు సన్మానం

చర్ల,(విజయక్రాంతి): చర్ల మండలం ఆర్.కొత్తగూడెం గ్రామపంచాయతీలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కింద బుధవారం గ్రామసభ నిర్వహించారు. 'స్వచ్ఛ భద్రాద్రి'లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు-2026పై ప్రజలకు అవగాహన కల్పించారు. తడి, పొడి, శానిటరీ వ్యర్థాలను తప్పనిసరిగా వేరు చేయాలని అధికారులు సూచించారు.

చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు మొదటిసారి గ్రామసభకు హాజరవగా సర్పంచ్ రవికుమార్, వార్డు సభ్యులు ఘనంగా సన్మానించారు. దుకాణదారులు చెత్తను విడిగా ఉంచి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సర్పంచ్ రవికుమార్ కోరారు. ఆత్మ కమిటీ చైర్మన్ ఇందల బుచ్చిబాబు మాట్లాడుతూ వర్షాకాల సన్నద్ధత, సురక్షిత తాగునీరు, జల సంరక్షణ, మొక్కల పెంపకంపై గ్రామస్తులకు వివరించారు.