19 June, 2026 | 4:11 PM

పెద్దపల్లిలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు

19-06-2026 01:42 PM

పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు

పెద్దపల్లి, జూన్ 19 (విజయక్రాంతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పెద్దపల్లి ఆయుష్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమ పోస్టర్‌ను ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఆవిష్కరించారు. శివపల్లిలోని తన నివాసంలో ఆయుష్ శాఖ అధికారులతో కలిసి ఆయన ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయుష్ శాఖ అధికారులు ఎమ్మెల్యే విజయరమణ రావు  యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆహ్వానించారు.

ప్రజలకు విజ్ఞప్తి

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 6:00 గంటలకు పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే యోగా కార్యక్రమానికి జిల్లా ప్రజలు, నియోజకవర్గ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ డిపార్ట్‌మెంట్ అధికారులు డాక్టర్ అరుణ కేశవ రెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.