19 June, 2026 | 4:30 PM

మంథనిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

19-06-2026 01:37 PM

మంథని, జూన్ 19(విజయ క్రాంతి): అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని మంథని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, విద్యార్థి నాయకులు బెజ్జంకి డిగంబర్, ఎరుకల ప్రవీణ్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ పోషిస్తున్న క్రియాశీలక పాత్రను, ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటాన్ని నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.