18 August, 2026 | 7:12 AM

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

24-05-2024 12:57 AM

ఒకరు మృతి.. 20 మందికి గాయాలు 

ఆదిలాబాద్, మే 23 (విజయక్రాంతి): ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటనలో ఓ మహిళ మృతిచెందగా, 20 మందికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. బుధవారం రాత్రి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన బస్సు నిర్మల్ జిల్లా సారం గపూర్ మండలంలోని మహబూబ్ ఘాట్ వద్ద అర్ధరాత్రి దాటాక ఎదురుగా వస్తున్న కారును తప్పిం చబోయి బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆదిలాబాద్‌కు చెందిన ఫర్హా న (30) అనే మహిళ దుర్మరణం చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గాయ పడ్డవారిని నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందిం చిన అనంతరం పలువురిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవ ర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరినట్లు ప్రయాణికులు తెలిపారు. ప్ర మాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారైనట్లు స్థానికులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.