25 August, 2026 | 2:45 PM

బోడు గ్రామపంచాయతీలో ఘనంగా వనమహోత్సవం

25-08-2026 02:13 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా టేకులపల్లి మండలం బోడు గ్రామపంచాయతీ పరిధిలో బండ్ ప్లాంటేషన్ చేపట్టి మంగళవారం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ పి డి శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీదేవి, బోడు సర్పంచ్ పొదెం స్వరూప, ఏపీవో శ్రీనివాస్, ఈసీ మొగిలి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్, టిఎ ఈశ్వరితో పాటు అటవీ శాఖ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది, ఉపాధిహామీ కూలీలు పాల్గొనగా, అటవీ శాఖ తరఫున ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎం.హతీరామ్,  ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు రవి, లక్ష్మణ్, అచ్చయ్య, అనితతో పాటు అటవీ వాచర్లు పాల్గొన్నారు. గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.